'పోటుగాడు'కి ఎ సర్టిఫికేట్…

  • IndiaGlitz, [Saturday,September 07 2013]

మంచు వారి కథానాయకుడు మనోజ్ నటించిన తాజా చిత్రం 'పోటుగాడు'. కన్నడంలో ఘనవిజయం సాధించిన 'గోవిందాయ నమహ' అనే సినిమాకి రీమేక్ గా ఈ సినిమా పునర్నిర్మించబడింది. కన్నడ వెర్షన్ కి దర్శకత్వం వహించిన పవన్ వాదేయర్ ఈ సినిమాకి కూడా డైరెక్ట్ చేశాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎ సర్టిఫికేట్ పొంది ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

వినోద భరితమైన కథాంశంతో తెరకెక్కిన 'గోవిందాయ నమహ' కన్నడంలో ఎలాగైతే విజయఢంకా మోగించిందో అదే మాదిరిగా.. తెలుగులోనూ విజయాన్ని సొంతం చేసుకుంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది.

కన్నడంలో తన సినిమాలతో మెప్పించిన పవన్ ఈ సినిమాని కూడా రసవత్తరంగా తెరకెక్కించి ఉంటే గనుక వారి మాటలు చాలా మటుకు నిజమయ్యే అవకాశముందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే అది కూడా ఎంతో కొంత సినిమాలో జోక్యం చేసుకునే తీరు గల మనోజ్.. అందుకు దూరంగా ఉండి ఉంటే మాత్రమేనని వారు గుసగుసలాడుకుంటున్నారు.